దాదాసాహేబ్ ఫాల్కే అందుకున్న బిగ్ బీ 

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ ప్రఖ్యాత దాదాసాహేబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా బిగ్ బీ అవార్డుని అందుకున్నారు.

ఇండియన్ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పేరిట ప్రభుత్వం ప్రతి ఏడాది ఒకరిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. 2019వ సంవత్సరానికిగాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అమితాబ్ బచ్చన్‌ని ఎంపిక చేసింది కేంద్రప్రభుత్వం. ఇప్పటికే ఆశా బోస్లే, లతా మంగేష్కర్, రాజ్ కపూర్, బాలచందర్ లాంటి సినీ దిగ్గజాలు ఈ అవార్డుని అందుకున్నారు. తెలుగులో ఇప్పటి వరకు బిఎన్ రెడ్డి, ఎల్వి ప్రసాద్, ఏఎన్నార్, రామానాయుడు, కె విశ్వనాథ్ లాంటి టాలీవుడ్ దిగ్గజాలు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.