రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గుతోంది : ఏపీ డీజీపీ
ఆంధ్రప్రదేష్ లో క్రైమ్ రేటు తగ్గుతోందన్నారు ఏపీ డీజీపీ సవాంగ్. వార్షిక క్రైమ్ నివేదికని మీడియాకి వివరించారు సవాంగ్. రాష్ట్రంలో క్రైమ్ రేటు ఆరు శాతానికి తగ్గిందని తెలిపారు. మహిళల భద్రతకి పెద్ద పీఠవేస్తున్నట్టు వివరించారు.
ఏపీలో క్రైమ్ రేటు తగ్గివుండొచ్చు. కానీ.. పొలిటికల్ హత్యలు మాత్రం తరచూ వెలుగులోనికి వస్తున్నాయి. పలుచోట్ల పలు మార్లు తెదేపా-వైకాపా వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకొన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ హత్యలు కూడా జరిగాయి. ఐతే, వీటిపై డీజీపీ సవాంగ్ స్పందించలేదు. దీనిపై కూడా వార్షిక నివేదిక ఇవ్వాలని ఓ రాజకీయ వర్గండిమాండ్ చేస్తోంది.