హైపర్ కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం
ముందే చెప్పినట్టుగా ఏపీ ప్రభుత్వం హైపర్ కమిటీని నియమించింది. ఏపీ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా, తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలని ఈ కమిటీ అందచేయనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన హైపర్ కమిటీ పని చేయనుంది. ఈ కమిటీలో మొత్తం 16మంది సభ్యులుగా ఉంటారు. జీఎన్ రావు కమిటీ, బీసీజీ (బోస్టన్ కన్సల్టెంట్స్ గ్రూప్) నివేదికలను అధ్యయనం చేసి.. మూడు వారాల్లోగా సూచనలతో కూడిన నివేదికను హైపర్ కమిటీ ఇవ్వనుంది.
హైపర్ కమిటీలో చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని కమిటీ కన్వీనర్ గా వ్యవహరించన్నారు. మంత్రులు పిల్ల సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, గౌతమ్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, మేకతోటి సుచరిత, కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, పేర్ని నానిలతో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్, అజయ్ కల్లాం సభ్యులుగా ఉంటారు. హైపర్ కమిటీ నివేదిక ఆధారంగానే ఏపీ రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది.