హీరోయిన్-నిర్మాత పబ్ గొడవలో బయటపడుతున్న షాకింగ్ నిజాలు
కన్నడ హీరోయిన్ సంజన, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ ల మధ్య బార్ లో చోటు చేసుకొన్న గొడవ మరింత రాజుకుంటోంది. క్రిస్మస్ రోజున (డిసెంబర్ 24) ఓ పబ్ లో సంజన, వందన గొడవపడ్డారు. మందు బాటిల్ తో వందనపై దాడి చేసింది సంజన. ఈ గొడవ పోలీస్ స్టేషన్ దాక వెళ్లింది. ఫైనల్ ఇద్దరి మధ్య రాజీ కుదిరినట్టు తెలిసింది. వందనతో గొడవ జరిగిన మాట నిజమే. దానిపై అప్పుడే రాజీ కుదిరిందని సంజన మీడియాకు తెలిపింది.
అదే సమయంలో వందన జైన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది సంజన. బెంగళూరులో వందనకి అక్రమ ఆస్తులున్నాయని.. ఆమె సినీ స్టార్స్, క్రికెటర్స్ ని వినియోగించుకొని డబ్బు సంపాదిస్తుందని ఆరోపించింది. బెంగళూరులో వందనకి రూ. 200కోట్ల ఆస్తులని చెప్పుకొచ్చింది. దీనిపై స్పందించిన వందన.. తన గురించి మాట్లాడటానికి సంజన ఎవరని ప్రశ్నించింది. అంతేకాదు.. సంజన గురించి తనకి పూర్తిగా తెలుసు. ఆమె చేసే పనులు తెలుసు అని ఘూటు వ్యాఖ్యలు చేసింది.
అంతేకాదు.. పబ్ లో తనపై సంజన మందుబాటిల్ తో దాడి చేయడాన్ని చాలామంది చూశారు. తాను సంజనపై తాను కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది. మొత్తానికి.. పబ్ గొడవ నేపథ్యంలో సంజన, వందన ఒకరి రహస్యాలని మరొకరు బయటపెట్టుకొనేలా ఉన్నారు. ఆ సీక్రెట్స్ తెలిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ కావడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇంతకీ.. వీరిద్దరు చేసిన చీకటి పనులు ఏమై ఉంటాయి అంటారు.. ??