సునీల్ మూడో అవతారం.. చూస్తారా ?

విలన్ అవుదామని వచ్చి కమెడియన్ అయ్యాడు సునీల్. స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉండగానే హీరోగా టర్న్ తీసుకొన్నారు. మర్యాదరామన్న, పూలరంగడు సినిమాలతో హీరోగా విజయాలు అందుకొన్నాడు. ఆ తర్వాత మాత్రం వరుస ప్లాపులతో ఇబ్బంది పడ్డాడు. ఇక హీరోగా లాభం లేదని భావించి.. కమెడియన్ రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఐతే, రీ ఎంట్రీ తర్వాత మునుపటి ఫామ్ ని అదుకోలేకపోయాడు.

ప్రస్తుతం కొత్త కురాళ్లు కమెడియన్ గా పాపులర్ అవుతున్నారు. బ్రహ్మానందం, అలీ లాంటి స్టార్ కమెడియన్స్ కే సరైన అవకాశం లభించని పరిస్థితి. ఈ నేపథ్యంలో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన పరిస్థితి అలాగే ఉంది. అందుకే ఆయన కొత్త అవతారం ఎత్తాడు. విలన్ గా మారాడు. సుహాస్‌, సందీప్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కలర్‌ ఫొటో’. ఈ చిత్రానికి సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వ్యవహరిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాతో సునీల్‌ విలన్ గా ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నేచురల్‌ స్టార్‌ నాని ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ‘కలర్‌ ఫొటో’ చిత్రాన్ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో టాలెంట్ ఉన్న వీళ్లు తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం నేనెంతో ఇంట్రస్ట్ గా ఎదురుచూస్తున్నాను. ఫస్ట్‌లుక్‌తోనే ఈ టీమ్ ఆకట్టుకుందని భావిస్తున్నాను’ అని నాని రాసుకొచ్చారు. మరీ.. సునీల్ మూడో అవతారంలో విలన్ గా నైనా రాణిస్తారేమో చూడాలి.