బుట్టబొమ్మ స్టెప్పులు అదిరాయ్ !


సంక్రాంతి సినిమా ‘అల.. వైకుంఠపురంలో’ రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తున్న సంగంతి తెలిసిందే. అల.. పాటలు అదిరిపోయాయ్. అత్యధిక వ్యూస్ సొంతం చేసుకొన్న తొలి తెలుగు పాటలుగా సామజవరగమన, రాములో రాముల రికార్డులు సృష్టించాయి. పాటలు మాత్రమే కాదు.. ఆ పాటలో స్టెప్పులు అదిరిపోయాయ్. 

తాజాగా బుట్టబొమ్మకి పాటకి సంబంధించిన మేకింగ్ బిట్ వీడియో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది హీరోయిన్ పూజా హెగ్డే. ఇందులో బన్నీతో కలిసి పూజా అదిరిపోయే స్టెప్పులేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక త్రివిక్రమ్-బన్నీ కలయికలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. జనవరి 6న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న అల.. ప్రేక్షకుల ముందుకు రానుంది.