వర్మ నుంచి మందు పార్టీ ఆహ్వానం.. ఎవరైనా వెళ్లొచ్చు !
సినిమాకి పబ్లిసిటీ తీసుకురావడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మని మించినోడు లేదు. పబ్లిసిటీ కోసం ఆయన ఏమైనా చేస్తారు. తాజాగా మందు పార్టీ ఇస్తున్నారు. ఆయన తాజా చిత్రం ‘బ్యూటీఫుల్’. అగస్త్య మంజు దర్శకత్వంలో నైనా గంగూలీ-సూరి జంటగా బ్యూటీఫుల్ తెరకెక్కింది. ఇంటెన్స్ లవ్‌స్టోరీ తెరకెక్కిన ఈ సినిమాని తనదైన స్టయిల్ లో ప్రమోట్ చేస్తున్నారు వర్మ. లైవ్ లోనే మందు పార్టీలో ప్లాన్ చేశారు. దానికి ‘వోడ్కా విత్ ఆర్జీవీ’ లైవ్ అని పేరు పెట్టారు.
‘వోడ్కా విత్ ఆర్జీవీ’ లైవ్. ఈ రోజు ‘బ్యూటిఫుల్’టీం ప్రి న్యూఇయర్ ప్రయివేట్ పార్టీ ఉంది. కానీ నాతో మరియు మా టీమ్‌తో కలిసి తాగడానికి అదేవిధంగా మాట్లడటానికి వీలుగా ఈ పార్టీకి మీ అందరినీ ఈ రోజు రాత్రి 8.45 గంటలకు ఫెస్‌బుక్, ఇన్‌స్టా లైవ్‌లో కలవడానికి ఆహ్వానిస్తున్నా’అంటూ వర్మ ట్వీట్ చేశాడు. దీనిపై ‘బంపర్ ఆఫర్ వర్మతో వోడ్కా పార్టీ’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘వోడ్కా, స్టఫ్ మీరు పంపిస్తారా లేక మేమే తెచ్చుకోవాలా’అంటూ మరొకరు సరదాగా కామెంట్ చేశారు.
VODKA WITH RGV LIVE ..The BEAUTIFUL team is having a Pre-New Year PRIVATE PARTY, but all PUBLIC are invited to have a drink and chat with me , @NainaGTweets , @parthsuri2050 and #AgastyaManju via live streaming on my FB and Insta tonight 8.45 pm onwards 💃💃💃 pic.twitter.com/0nW4VdU3ZN
— Ram Gopal Varma (@RGVzoomin) December 29, 2019