ఆథిత్య థాక్రేకు మంత్రి పదవి

మరికాసేపట్లో మహారాష్ట్ర మంత్రి వర్గం విస్తరణ జరగనుంది. ముంబయిలోని విధాన్ భవన్ లో జరిగే కార్యక్రమంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి దక్కనుందని తెలుస్తోంది. అలాగే. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభకు ఎన్నికైన శివసేన యువనేత, సీఎం ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రేను కూడా కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు తెలిసింది.  ఆయనకు పర్యావరణం లేదా ఉన్నత విద్యాశాఖ కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టే నేతల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. సీనియర్ నేతలు అశోక్ చవాన్, కేసీ పాడ్వీ, విజయ్ వదెత్తివార్ సహా అమిత్ దేశ్ ముఖ్, సునిల్ కేదార్, యశోమతి ఠాకూర్, వర్షా గైక్వాడ్, అస్లామ్ షేక్, సతేజ్ పటేల్, విశ్వజీత్ కదమ్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు వెల్లడించింది.