మిడ్ మానేరు లింక్ విజయవంతం : సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ మిడ్ మానేరు ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం కరీంనగర్ లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. మిడ్ మానేరు లింకు విజయవంతం అయిందన్నారు. ఇకపై ఎస్సారెస్పీతో సంబంధం లేకుండా రెండు పంటలు పండుతాయన్నారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు నిండుగా ఉన్నాయన్నారు. 90టీఎంసీలు ఉపయోగించుకోవచ్చన్నారు.
ప్రాణహిత నుంచి ఏడాదంతా నీరు వస్తుందని.. ఈ ప్రాంతానికి కరువు పీడపోయిందన్నారు. జీవనది ఉన్నా కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలో కరువు ఉండేది. ప్రస్తుతం తెలంగాణ పోరాట ఫలితాలు సఫలమవుతున్నాయన్నారు సీఎం. గతంలో పెద్ద ఎత్తున కరువుతో వలసలు వెళ్లారన్నారు. కరెంట్ కోతలతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని గతంలో గోడలపై కలెక్టర్ రాయించాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడా పరిస్థితులు పోయాయి. ఈ ప్రాంత రైతులు రెండు పంటలు పండింకోవచ్చన్నారు.