#DaangDaang ఫుల్ సాంగ్ వచ్చేసింది !

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓ స్పెషల్ సాంగ్ లో తమన్నా సందడి చేయనుంది. శనివారం విశాఖ ఉత్సవ్ వేదికగా ఈ పాట ప్రోమో సాంగ్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా #DaangDaang ఫుల్ సాంగ్ ని వదిలారు.

మిలటరీ జవానుల ఫేర్ వెల్ పార్టీలో సాంగ్ ఇది. రామజోగయ్య శాస్త్రీ రాసిన ఈ పాటని నకాష్ ఆజిజ్, లవితా లోబో కలిసి పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నాతో కలిసి మహేష్ అదిరిపోయే స్టెప్పులేశాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జనవరి 5న హైదరాబాద్ ఎల్భీ నగర్ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న సరిలేరు ప్రేక్షకుల ముందుకు రానుంది.