మందు బాబులకి మెట్రో బంపర్ ఆఫర్

హైదరాబాద్ మెట్రో డిసెంబర్ 31న ప్రత్యేక ఆఫర్ ని ప్రకటించింది. మందు బాబులు ప్రయాణించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐతే, తాగి ఇతరులకి ఇబ్బందులు కలగకుండా ఉండేవరకే… ఈ అనుమతి అని పేర్కొంది. అంతేకాదు.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో మంగళవారం (డిసెంబర్ 31) అర్థరాత్రి 1గంటల వరకు మెట్రో ప్రత్యేక సర్వీసులని నడపనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. 

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలుకేనని హైదారాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేసిన నేపథ్యంలో.. మెట్రో ఆఫర్ మందు బాబులకి ఊరట కలిగించే విషయం. ఇక, కొన్ని పబ్ లు మాత్రం కస్టమర్లకి డ్రాపింగ్ ఫెసిలిటీని కల్పించనున్నట్టు ప్రకటించాయి. ఏం పర్వాలేదు. మీరు తాగండి. మిమ్మల్ని మీ ఇంటిదగ్గర వదిలిపెట్టే బాధ్యత తమదని పబ్ లు ఆఫర్స్ ప్రకటించాయి.