హిందుత్వంపై ఆఫ్రిది అక్కసు చూశారా ?
పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియాపై పాక్ జట్టులో కొందరు వివక్ష చూపించారని ఇటీవల దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అక్తర్ చెప్పింది వాస్తవమని, ఆడుతున్న రోజుల్లో ఈ విషయం గురించి మాట్లాడే ధైర్యం లేక చెప్పలేకపోయానని కనేరియా తెలిపాడు. అయితే దీనిపై స్పందించిన పాక్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం జట్టులో అలాంటి వివక్ష తాను చూడలేదని అన్నాడు. ఈ నేపథ్యంలో గతంలో అఫ్రీది ఇంటర్వ్యూ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆఫ్రిదికి మీరెప్పుడైనా టీవీని బద్దలు కొట్టారా ? అనే ప్రశ్న ఎదురైంది. నా భార్య కారణంగా ఒకసారి టీవీని పగలకొట్టాను. పిల్లలతో కాకుండా ఒంటరిగా టీవీని చూడాలని నా భార్యకు ఎన్నోసార్లు చెప్పాను. అప్పుడు ఓ ఛానెల్లో షోలు ఎక్కువగా వచ్చేవి. ఆ ఛానెల్ ని చూస్తూ నా కుమార్తె హారతి ఇవ్వడం చూశాను. దీంతో టీవీని బద్దలుకొట్టాను అని అఫ్రీది వెల్లడించాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణ ప్రజలే కాదు. పాక్ లో సెలబ్రేటీలు ఇలాగే ఉంటారా ? అని కామెంట్స్ చేస్తున్నారు.
Here Shahid Afridi is making fun of the Hindu ritual of Aarti and everyone’s enjoying but remember how he tweeted on the plight of Uighar muslims just two days ago and everyone forced him to delete? Islam is just an excuse to hide poverty in Pakistanpic.twitter.com/PyXV9e8QkC
— Monica (@TrulyMonica) December 28, 2019