జర్నలిస్టులపై మంత్రి ఫైర్.. హామీ !
ఇటీవల అమరావతిలో జర్నలిస్టులపై దాడి జగిగిన సంగతి తెలిసిందే. టీవీ9 యాంకర్ దీప్తితో పాటు మరికొందరిపై రాజధాని రైతులు దాడి చేశారు. తాజాగా ఈ దాడులపై మంత్రి షేర్న్ నాని స్పందించారు. జర్నలిస్టు యూనియన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్ కోసం ఎగబడే జర్నలిస్ట్ యూనియన్లు.. మీడియా ప్రతినిధులపై దాడి జరిగితే ఏమైపోయాయని మంత్రి ప్రశ్నించారు.
జర్నలిస్టులకి ప్రభుత్వం అండగా ఉంటుందని నాని భరోసా ఇచ్చారు. ఎన్టీవీ హరీశ్, టీవీ9 దీప్తి, మహాటీవీ వసంత్ పేర్లని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. జర్నలిస్టులను కొట్టిన వారిని చంద్రబాబు నాయుడు, లోకేశ్ సమర్థించడం దారుణమన్నారు. కష్టం గురించి తెలిసిన వాడు రైతని, నిజమైన రైతు ఎవరిమీదా దాడులు చేయడని అన్నారు. రైతుల ఆందోళన శాంతి యుతంగా ఉంటుందని మంత్రి అన్నారు. జర్నలిస్టుపై దాడి చేసిన వారిలో ఇప్పటికే పోలీసులు కొందరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.