సెహ్వాగ్ ని ఓపెనర్’గా పంపడం వెనక సీక్రెట్ విప్పిన గంగూలీ
డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ మొదట్లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే ఆయన్ని ఓపెనర్ గా ప్రమోట్ చేశాడు ఆనాటి టీమిండియా కెప్టెన్ గంగూలీ. తాజాగా సెహ్వాగ్ ని ఓపెనర్ గా పంపడం వెనక సీక్రెట్ ని పంచుకున్నారు. మిడిలార్డర్ లో నీ స్థానంలో మాత్రమే ఆడటానికి అలవాటు పడకుండా.. జట్టు కోసం అన్ని స్థానాల్లో ఆడేందుకు సిద్ధంగా ఉండాలని సెహ్వాగ్ కు తాను చెప్పా. ఆ తర్వాత ఓపెనర్ గా బరిలోకి దింపానని గంగూలీ తెలిపారు.
వన్డేల్లో నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తే తాను కూడా రాణించలేను. అంతెందుకు మిడిల్ ఆర్డర్ లో సచిన్ బ్యాటింగ్ చేసినా అతను చేసిన పరుగుల్లో సగం మాత్రమే సాధించేవాడని గంగూలీ అభిప్రాయపడ్డారు. మన దేశంలో సునీల్ గవాస్కర్ ను అత్యున్నత ఓపెనర్ గా భావిస్తామని… ఆయనకు సెహ్వాగ్ ఏమాత్రం తీసిపోడని గంగూలీ కితాబిచ్చారు. వీరిద్దరి బ్యాటింగ్ మ్యాచ్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని గంగూలీ అన్నారు.