మహిళతో ఏఎస్పీ శృంగార వీడియో.. లీక్ !
చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీ దారితప్పితే ఎలా ? మహిళలకి రక్షణ కల్పించాల్సిన ఖాకీ.. శృంగార ముచ్చలు చెబితే ఎలా.. ? ఉత్తర ప్రదేశ్ లో ఏఎస్పీ హోదాలో ఉన్న వైభవ్ కుమార్ అనే అధికారి ఓ మహిళతో శృంగార పరమైన చాటింగ్, ఫోన్ లో మాట్లాడుతున్న వీడియోలు ఆన్ లైన్ లో లీకయ్యాయి. వైరల్ అవుతున్నాయి.
ఓ మహిళ, సదరు ఎస్పీతో మాట్లాడుతూ.. చాటింగ్ చేస్తూ, మరో స్మార్ట్ ఫోన్ తో వీడియో తీసింది. ఈ వీడియోలోని వాయిస్ గౌతమ్ బుద్ధ నగర్ ఏఎస్పీ వైభవ్ కుమార్ దేనని తెలుస్తోంది. ఆ వీడియాలో ఏఎస్పీ శృంగార ముచ్చట్లు మత్తుగా ఉన్నాయి. ఇప్పుడీ మత్తు ముచ్చట్లు ఆయన పరువుని బజారున పడేశాయి. ఐతే, తన ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కొందరు మార్ఫింగ్ చేసిన వీడియోలను ప్రచారం చేస్తున్నారని ఏఏస్పీ ఆరోపించారు.
ఏడాది కాలంగా నేరాలపై, ఎక్స్ టార్షన్ రాకెట్స్ పై తాను కఠినంగా వ్యవహరించానని, అందుకు దక్కిన బహుమతే ఇదని ఆయన వాపోయారు. అంతేకాదు.. వీడియోలను ఆన్ లైన్ లో పెడుతున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోనున్నామని హెచ్చరించారు. నిజంగానే ఆ వీడియోలు నిజమైనవే అయితే.. ఏఎస్పీకి కష్టాలు తప్పకపోవచ్చు.