రాజశేఖర్’పై చిరు ఫైర్
మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ హీరో రాజశేఖర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ తనదైన శైలిలో విమర్శలు చేశారు.
దీనిపై చిరు స్పందిస్తూ.. “నేను ఇందాక చెప్పిన మాటలకు విలువే ఇవ్వలేదు. మంచి వుంటే మైక్ లో చెప్పండి, చెడు వుంటే చెవిలో చెప్పుకుందామని అన్నాను. అది గౌరవం ఇవ్వలేని వారికి… నిజంగా ఇక్కడ ఎందుకు ఉండాలి? పెద్దలుగా మేమంతా ఎందుకు ఉండాలి? ఎందుకు ఇలా రసాభాస చేయడం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనతను చెప్పుకోవడం ఎలా ఉంటుంది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిరు మందచ్చిన తర్వాత కూడా రాజశేఖర్ తగ్గలేదు. మరోసారి కల్పించుకున్న రాజశేఖర్.. తాను నిజాన్ని మాత్రమే మాట్లాడానని, తాను ఎవరి ముందూ తలవంచుకుని ఉండబోనని చెబుతూ స్టేజ్ దిగి వెళ్లిపోయారు. ఐతే.. వీరంతా పక్కా ప్రణాఌకతో ఇక్కడి వచ్చారు. కార్యక్రమాన్ని పాడు చేసే ఉద్దేశం వారిలో స్పష్టంగా కనిపిస్తోందని చిరు మండిపడ్డారు.