రాజశేఖర్’పై చిరు.. ఆ ప్రచారమే నిజమైంది !
‘మా’ గొడవలు మరోసారి తెరపైకి వచ్చాయి. మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ హీరో రాజశేఖర్ మరోసారి మా అధ్యక్షుడు నరేష్ తో ఉన్నవిబేధాలని ప్రస్తావించారు. ఐతే, దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ ప్రీ ప్లాన్ డ్ గా వచ్చారు. ఆయన్ని పీకి పారేయండీ. కఠిన చర్యలు తీసుకోండని అంటూ మా క్రమశిక్షణ కమిటీకి సూంచారు.
రాజశేఖర్ పై చిరు రియాక్షన్ ఊహించినదేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. రాజశేఖర్-నరేష్ గొడవలకి ఇండస్ట్రీ పెద్దలు పరిష్కరించాలనే డిమాండ్ గతంలోనే వచ్చింది. చిరు, మోహన్ బాబు, కృష్ణంరాజు లాంటోళ్లు మా వివాదంలో జోక్యం చేసుకోవాలనే వినతులు వినిపించాయ్. ఆ సమయంలోనే చిరు కచ్చితంగా రాజశేఖర్ ని సపోర్ట్ చేయరు. ఆయన సపోర్ట్ నరేష్ కే ఉంటుందన్నారు. ఇప్పుడు అదే జరిగింది.
కాకపోతే.. ఇక్కడ సీన్ ప్రూప్ ఉంది. రాజశేఖర్ ఫైర్ అవ్వడం తప్పు కావొచ్చు. కానీ ఆయన ఆవేదన తప్పుకాదు. మా లో ఉన్న గొడవలు నిజం. కాకపోతే.. వాటిని కప్పి ఉంచి బయటికి మంచి మాటలు మాట్లాడలేకపోయిన రాజశేఖర్ దంపతులు విలన్స్ అయ్యారు. లోపల రగిలిపోతున్న బయటికి నవ్వుతున్న నరేశ్ మంచి వాడయ్యాడని చెప్పుకొంటున్నారు.