ఈటెల మరోసారి సంచలన కామెంట్స్
తెరాస సీనియర్ నేత ఈటెల రాజేందర్ ఇటీవల రెబల్ గా మారినట్టు అనిపించింది. గత యేడాది జరిగిన తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సమయంలో ఈటెల మంత్రి పదవి ఊడనుందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై ఈటెల ఘూటుగా స్పందించారు. ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఈటెల గులాభి జెండాని అసలైన ఓనర్లం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఆయనకి సీఎం కేసీఆర్ కి అంతరం పెరిగినట్టు అనిపించింది. ఐతే, ప్రచారం జరిగినట్టు ఈటెల మంత్రి పదవికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆయన మంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. ఈటెల కుటుంబంలో జరిగిన పెళ్లి వేడుకకి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్, ఈటెల మళ్లీ సన్నిహితంగా కనిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈటెల కూల్ అయ్యారను అనుకొన్నారు.
తాజాగా మరోసారి ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నమ్మక ద్రోహం చేసేవాళ్లు బాగుపడరు’ అంటూ శాపనార్థాలు పెట్టారు. కొట్లాడాటం తెలుసు. కానీ, ఇలా నమ్మకం ద్రోహం తెల్వదని తనదైన శైలిలో సటైర్స్ వేశారు. ఇంతకీ ఈటెలకి నమ్మక ద్రోహం చేసింది ఎవరు ? అంటూ.. రాజకీయాల్లో వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి.. మరోసారి ఈటెల రెబలిజం మరోసారి బయటపడింది.