కేటీఆర్’నే సీఎం.. ఎర్రబెల్లి ఓపెన్ అయ్యారుగా !
మంత్రి కేటీఆర్ విషయంలో మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓపెన్ అయ్యారు. కేటీఆర్’కు సీఎం అయ్యే అనీ అర్హతలు ఉన్నాయని.. తెలంగాణ తదుపరి సీఎం కేటీఆర్ నే అన్నారు. గురువారం వరంగల్ రూలర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి పై వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. నారా లోకేష్, రాహుల్ గాంధీలతో కేటీఆర్ ని పోల్చీ చూశారు.
లోకేష్, రాహుల్ మాదిరిగా కేటీఆర్ అసరమర్థుడు కాదు. ఆయన సీఎం కావడానికి కేటీఆర్ అన్ని విధాల సమర్థుడు అన్నారు. కేటీఆర్ నేతృత్వంలో తమ పార్టీ అన్ని ఎన్నికల్లో విజయం సాధించిందని.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘన విజయం ఖాయమన్నారు. ఫ్యామిలీ రాజకీయాలని పరోక్షంగా ప్రస్తావించిన ఎర్రబెల్లి.. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన నెహ్రూ కుటుంబం దేశంలో ప్రభుత్వాన్ని నడపిందని.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కుటుంబం ఎందుకు పాలించొద్దని నిలదీశారు.
ఒక్కమాటలో చెప్పాలంటే.. కేసీఆర్ తెలంగాణ గాంధీ అని చెప్పే ప్రయత్నంచారు ఎర్రబెల్లి. ఆయన ఆవేశం, ఆలోచన కరెక్టే. కానీ, ప్రత్యేక ఉద్యమం ఉదృతంగా జరుగుతున్న సమయంలో ఆయన తెదేపాలో ఉన్నారు. ఉద్యమం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శలు చేశారు. తెలంగాణలో వచ్చి.. తెరాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెరాసలోకి వచ్చారు. ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నారు.