బాలీవుడ్ భామతో హార్దిక్‌ పాండ్య సీక్రెట్ ఎంగేజ్‌మెంట్

టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఈ యేడాదియే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతడు గత కొన్నాళ్లుగా సెర్బియా వెూడల్‌, బాలీవుడ్ భామ నటాషా స్టాన్‌కోవికతోే డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిచి చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. న్యూ ఇయర్ కానుకగా నటాషాతో హార్ఠిక్ నిశ్చితార్థం చేసుకొన్నాడు. 

సముద్ర జలాల్లో ఓ హ్యాచ్‌లో ప్రయాణిస్తూ పాండ్య తన ప్రియసఖికి ఉంగరం తొడిగాడు హార్దిక్ పాండ్య. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ‘హెచ్‌పీ లవ్స్‌ నాట్స్’ అని రాసి పెట్టిన కేక్ కట్ చేశారు. ఎంగేజ్ మెంట్ చేసుకొన్న విషయాన్ని నటాషా, హార్థిక్ ఇద్దరు సోషల్ మీడియా ద్వారా సందేశం ఇచ్చారు. నటాషా ఎంగేజ్ మెంట్ ఉంగరం చూపుతున్న ఫోటోని తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన హార్థిక్ పాండ్యా.. ‘మై తేరా, తు మేరీ జాన్‌, సారా హిందుస్థాన్‌. 01.01.2020 #ఎంగేజ్‌డ్‌’ అని పేర్కొన్నారు.

మరోవైపు నటాషా సైతం ఉంగరం ధరించి తన ప్రేమికుడిని ముద్దాడుతున్న వీడియోను పోస్ట్‌ చేసింది. దీంతో ఈ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు. టీమిండియా కెప్టెన్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, ధోనీ భార్య సాక్షి, అజయ్ జడేజా, కృనాల్ పాండ్యా భార్య పంఖూరి శర్మ, సోఫీ చౌదరి, సోనాల్ చౌహాన్, శ్రేయాస్ అయ్యర్, మన్‌దీప్ సింగ్ లతో పాటు ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్థిక్ పాండ్యాకు శుభాకాంక్షలు తెలిపారు.

View this post on Instagram

Forever yes 🥰💍❤️ @hardikpandya93

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on