ఆయన ఫైర్ అయ్యాడు.. ఈమె కూల్ చేసింది !
మా డైరీ విడుదల కార్యక్రమం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ‘మా’లో ఉన్న విబేధాలను ఎత్తి చూపుతూ సీనియర్ హీరో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు కార్యక్రమాన్ని హీటెక్కించాయి. దీనిపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ పై గట్టి చర్యలు తీసుకోవాలని ‘మా’ని కోరారు. ఐతే, పరిస్థితిని చేయి దాటిపోకుండా జీవిత రంగంలోకి దిగారు. మా ఆయన తరుపున నేను క్షమాపణ చెబుతున్నా అంటూ కూల్ చేసే ప్రయత్నం చేశారు.
”మా’ కార్యవర్గంలో సభ్యురాలినైనప్పటి నుంచి నేటి వరకూ నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఎందరో గొప్ప నటీనటుల వల్లే నేను ఎన్నో నేర్చుకున్నారు. అందరిలాగానే మాలో కూడా కొన్ని విబేధాలున్నాయి. గొడవలు రావడం సహజం. రాజశేఖర్, నేను ‘మా’ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలనుకున్నాం. ఆయన చిన్నపిల్లాడు లాంటివాడు. ఇలాంటి కార్యక్రమంలో ఆయన అలా మాట్లాడినందుకు క్షమించమని నేను కోరుతున్నా”నన్నారు జీవితారాజశేఖర్.