చిరు152 రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యూలర్ హైదరాబాద్ లో ఇవాళ మొదలైంది. అంతేకాదు.. షూటింగ్ స్పాట్ నుంచి మెగాస్టార్ పిక్ ఒకటి బయటికొచ్చింది. లైబ్రరీలో చిరు ఉన్న పిక్ ఇది. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో నక్సలిజం ఎలిమెంట్ తో ఈ సినిమా రాబోతోంది. కాకపోతే ఇది ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే కనిపిస్తుంది. సినిమాలో చిరు దేవదాయ శాఖ ఉద్యోగిగా కనిపించబోతున్నారు. ఆయనకి జంటగా త్రిష నటించనుంది.  ఓ ప్రత్యేక గీతం కోసం యంగ్ హీరోయిన్ ని రెజీనాని సంప్రదించారని తెలుస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మను సంగీతం అందించనున్నారు. ఆగస్టు 14న చిరు152 ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పుకొంటున్నారు.