‘మా’కు రాజశేఖర్ రాజీనామా
సీనియర్ హీరో రాజశేఖర్ ఆవేశం చూపించారు. గురువారం పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మా నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ ఆవేశంగా ప్రసంగించారు. అందరం కలిసే నడవాలని చిరంజీవిగారు చాలా బాగా మాట్లాడారు. మాలో గొడవలున్నాయి.. రియల్ లైఫ్ లో హీరోగా పనిచేస్తుంటే తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలను చిరంజీవి వెంటనే ఖండించారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మాను కోరారు. చిరు ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా ఉపాధ్యక్ష పదవికి సినీ నటుడు రాజశేఖర్ రాజీనామా చేశారు.
రాజీనామా లేఖని రాశారు. ఇందులో మా అధ్యక్షుడు నరేష్ ఆయన పడిన బాధని వివరించారు. మా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి అసోసియేషన్ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తూ, ఉత్తమంగా పనిచేస్తున్నా. అయితే, మాలో సమస్యలను పరిష్కరించడానికి బదులు అధ్యక్షుడు నరేశ్ కమిటీ సభ్యులను ఉద్దేశించి కించపరిచేలా, అవమానకరంగా మాట్లాడుతున్నారు. పారదర్శకతకు నీళ్లొదిలి, పదే పదే తప్పులు మీద తప్పులు చేస్తూ, మెజార్టీ సభ్యులు ఆమోదించిన నిర్ణయాలను పక్కన పెడుతున్నారు. అదే సమయంలో ఆయనకు నచ్చినట్లు చేసుకుంటూ వెళ్తున్నారు. నరేశ్ వ్యవహారశైలి నాకు ఏమాత్రం నచ్చడం లేదు. మా ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాని తెలిపారు.