గుడ్ న్యూస్ : రూ.15కే కిలో ఉల్లీ

గత యేడాది సాధారణ ప్రజలని ఏడిపించింది ఉల్లి. కోయడం కాదు.. కొనేటప్పుడే కన్నీళ్లు పెట్టిందించి. కిలో ఉల్లీ ఏకంగా రూ. 200లు పలికింది. ఇప్పటికీ ఉల్లీ రేటు తగ్గలేదు. కిలో రూ. 50 నుంచి 100వరకు పలుకుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పింది. కిలో ఉల్లీని రూ. 15కే అందిస్తోంది.

కడప జిల్లా రైతుల నుంచి నేరుగా ఉల్లిని సేకరించి రాష్ట్రంలోని 101 రైతు బజార్లలో చి కిలో రూ.15లకే పంపిణీ చేయనుంది. కడప ఉల్లికి కిలోకు రూ. 50 నుంచి రూ.60లు ప్రభుత్వం చెల్లించనుంది. రోజుకు 50 నుంచి 60 టన్నుల ఉల్లిని మార్కెటింగ్‌ శాఖ తెప్పించనుంది. వీటిని కిలో రూ.15కే వినియోగదారులకు అందించాలని అధికారులు నిర్ణయించారు.