బ్రేకింగ్ : రాయపాటిపై ఈడీ కేసు
తెదేపా సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదైంది. ఆయనపై నిబంధనలకు విరుద్ధంగా నిధులను మళ్లీంచారనే ఆరోపణలున్నాయి. సింగపూర్, మలేషియా, రష్యా దేశాలకు పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫెమా చట్టం కింద రాయపాటితో పాటు ట్రాన్స్ట్రాయ్ కంపెనీపై కూడా కేసులు నమోదయ్యాయి.
సింగపూర్, మలేషియాకు రూ.16 కోట్లను తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటికే రాయపాటితో పాటు కుమారుడు రామారావు, ట్రాన్స్ట్రాయ్ కంపెనీలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 15 బ్యాంకుల నుంచి సుమారు రూ.8,832 కోట్లు రుణం తీసుకున్న ఈ కంపెనీ రూ.3822 కోట్లు డైవర్ట్ చేసినట్లు సీబీఐ అనుమానిస్తోంది.