సరిలేరు సెన్సార్ రివ్యూ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందింది.

ఇక సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సరిలేరు సూపర్ అంటున్నారు. అభిమానులకి మహేష్ విందు భోజనం పెట్టబోతున్నాడని చెబుతున్నారు. కథ-కథనాలు బలంగా రాసుకోవడంతో పాటు.. సినిమాని వినోదాత్మకంగా నడపడం అనిల్ రావిపూడి ప్రత్యేకత. సరిలేరు కూడా అదే మార్క్ తో ఉందట. కథ-కథనాలు అద్భుతంగా సాగాయట. వినోదం, ఎమోషన్స్ పండిన సరిలేరు అసలు సిసలు సంక్రాంతి సినిమాగా నిలవడం ఖాయమన్నది సెన్సార్ సభ్యుల టాక్ అని తెలుస్తోంది.

అంతేకాదు.. ఈ సినిమాలో మహేష్ ఒకట్రెండు సప్రైజ్స్ ఇచ్చారట. అదే డ్యాన్స్. ఈసారి మహేష్ డ్యాన్స్ ఇరగదీశాడని చెబుతున్నారు. తమన్నాతో కలిసి మహేష్ చేసిన #DaagDaag ఐటమ్ సాంగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. ఆర్మీ ఏపీసోడ్, విజయశాంతి-మహేష్ ల మధ్య సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి సరిలేరు సెన్సార్ టాక్ బ్లాక్ బస్టర్ హిట్టు.