విజయశాంతి కావాలా.. ? కండీషన్స్ అప్లై !

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు 13యేళ్ల తర్వాత మొహానికి రంగేసుకున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇందులో ప్రొఫెసర్ భారతి పాత్రలో ఆమె కనిపించనుంది. సీరియస్ మూడులో సాగే పాత్ర.. అయినా అద్భుతంగా ఉంటుంది. మహేష్-విజయశాంతిల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా ఉండబోతున్నాయని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత కూడా విజయశాంతి వరుస సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐతే, అది సరిలేరు ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే విజయశాంతితో సినిమా చేయాలని ఆతృతని కనబరుస్తున్న దర్శక-నిర్మాతలకి కొన్ని కండీషన్స్ చెబుతోంది లేడీ సూపర్ స్టార్. అవేంటంటే.. ? 

తల్లి పాత్రలు, అతిథి పాత్రలు చేయను. బలమైన కథ ఉండాలి. అందులో నా పాత్ర మరింత బలంగా ఉండాలి. అంతేకాదు.. భారీ పారితోషికం ఇవ్వడానికి సిద్ధపడితేనే కథ వినిపించడానికి రావాలనేది విజయశాంతి పెట్టిన షరతులు అనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. రాములమ్మ తదుపరి సినిమా కూడా అనిల్ రావిపూడితోనే ఉండనుందని తెలుస్తోంది. అంతేకాదు.. ఎఫ్ 2 సీక్వెల్ కోసం ఆమె ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్ఛేసినట్టు తెలుస్తోంది.