‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ టీజర్ టాక్ : ‘అర్జున్ రెడ్డి’కి నాలుగు రెట్లు

సినిమా సినిమాకి ప్రేక్షకులకి షాక్ ఇవ్వడం టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండకు అలవాటైపోయింది. ‘పెళ్లి చూపులు’ సినిమా చేసిన విజయ్ ‘అర్జున్ రెడ్డి’గా మారి ప్రేక్షకులకి తొలి షాక్ ఇచ్చారు. అదే అర్జున్ రెడ్డి విజయ్ గోవింద్ (గీత గోవిందం) మరో షాక్ ఇచ్చాడు. ఈ రెండు పూర్తి విభిన్నమైన పాత్రలు. ప్రతి సినిమాకి కొత్తగా కనిపిస్తున్న విజయ్ స్టార్ హీరోలని మించిన క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ఆయన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’. ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకుడు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసాబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాని విడుదల చేశారు.

‘అర్జున్ రెడ్డి’ నాలుగు రెట్లుగా ‘వరల్డ్ ఫేమస్ ఫేమస్ లవర్’ ఉండబోతుందని టీజర్ తో అర్థమవుతోంది. నలుగురితో విజయ్ రొమాన్స్.. దానికి సంబంధించిన ఎమోషన్స్ తో టీజర్ ని కట్ చేశారు. లిప్ లాకులు, బెడ్ రూమ్ సీన్స్ బోలేడు ఉన్నాయి. యూత్ ని థియేటర్స్ వైపు పరుగులు పెట్టించేలా ఉంది టీజర్. ఆ సంచలన టీజర్ ని మీరు చూసేయండీ.. !