ఇకపై టాలీవుడ్’లో అలీవుడ్ సినిమాలు

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. సినిమాలు చూశాం. ఇకపై అలీవుడ్ సినిమాలు రాబోతున్నాయ్. అలీవుడ్ ఏంటీ.. అనుకుంటున్నారా.. ? ఇదో నిర్మాణ సంస్థ. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ సొంత బ్యానర్. ఈ బ్యానర్ లో హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో సినిమాలు నిర్మించనున్నారు. వెబ్ సిరీస్,టీవీ షోలు, డైలీ సీరియల్స్, వాణిజ్య చిత్రాలు రూపొందించనున్నారు. మణికొండలోని అలీ నివాసానికి దగ్గరగా ఈ సంస్థ కార్యాలయం ఉంటుంది.

అలీకి వెన్నెముక అయిన శ్రీబాబా నేతృత్వంలో క్రియేటివ్ డైరెక్టర్ మనోజ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ సంస్థ కార్యకలాపాలు ఉంటాయి. ఈ బ్యానర్ ఓపెనింగ్ కి  ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి , నిర్మాత అచ్చిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ, ప్రొడ్యూసర్ జయచంద్ర, అలీ బ్రదర్ ఖయ్యూం, హీరో రవివర్మ తదితరులు విచ్చేశారు. అలీవుడ్ సంస్థ 24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన సేవలను అందిస్తుందన్నారు అలీ.