జార్ఖండ్ సీఎం.. ఓ మంచి నిర్ణయం !

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చేవారు పుష్ఫ‌గుచ్ఛాలు తీసుకురావ‌ద్దు.. దానికి బ‌దులుగా పుస్త‌కాలు గిఫ్ట్‌గా ఇవ్వాల‌న్నారు. బొకేలు చాలా ఖ‌రీదైన‌వి ఉంటాయి. కొద్దిసేపటికే వాడిపోతాయి. వాటి వలన ఉపయోగం ఉండదు. బొకేలకి బదులుగా పుస్త‌కాల‌ను ఇస్తే బాగుంటుంది.. ఆ పుస్త‌కాల‌తో లైబ్ర‌రీ త‌యారు చేయ‌వ‌చ్చు. దాని వల్ల ప్ర‌జ‌లు లాభ‌ప‌డుతార‌ని సీఎం తెలిపారు. హేమంత్ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక ఇటీవల జరిగిన జార్ఖండ్ అంసెబ్లీ ఎన్నికల్లో జేఎంఎం- కాంగ్రెస్‌- ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి 47 స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. కూటమి పార్టీలు ముందస్తు ఒప్పంద ప్రకారం జేఎంఎం అధినేత హేమంత్ సోరన్ జార్ఖండ్ సీఎం అయ్యారు.