పవన్ ఇంటి విబేధాలని గెలికిన రాపాక

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ సాండ్’కు వ్యతిరేకంగా పనిచేస్తుండటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ నిర్ణయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేస్తుంటే.. రాపాక సీఎం జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం, రాజధాని అంశం తదితర అంశాలపై సీఎం జగన్ నిర్ణయాన్ని రాపాక ప్రశంసించారు.

సీఎం జగన్ ఫోటోకి పాలాభిషేకం కూడా చేశారు. పార్టీ స్టాండ్ కి వ్యతిరేకంగా పని చేస్తున్నారనే ప్రచారంపై తాజాగా రాపాక స్పందించారు. రాజధానిపై పవన్ నిర్ణయంతో తనకు సంబంధంలేదని రాపాక స్పష్టం చేశారు. పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు పార్టీలో రెండు అభిప్రాయాలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు.

చిరంజీవి సైతం మూడు రాజధానులను సమర్థించారని గుర్తుచేశారు. అంతేకాదు.. పవన్ కూడా మూడు రాజధానులను వ్యతిరేకించడంలేదని.. ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టం చేయమని అడుగుతున్నారని చెప్పుకొచ్చాడు. ఐతే, రాపాక పవన్ ఇంటి విబేధాలని గెలకడం హాట్ టాపిక్ గా మారింది.