రాశీఖన్నా న్యూడ్ పిక్ పై అభిమానుల అసంతృప్తి

యంగ్ హీరోయిన్ రాశీఖన్నా మొదట్లో గ్లామర్ హీరోయిన్ అనిపించుకుంది. వరుసగా గ్లామర్ పాత్రలో మెరిసింది. ఐతే, ‘తొలిప్రేమ’ రాశీలోని కొత్త కోణాన్ని బయటికి తీసింది. అద్భుతమైన నటనతో మంచి నటి అనిపించుకుంది. తొలిప్రేమ తర్వాత రాశీకి నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలూ వస్తున్నాయి. గత నెలలో వెంకీమామ, ప్రతిరోజూ పండగ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది రాశీ. ఈ రెండు సినిమాలు హిట్ కావడంతో రాశీ డబుల్ హిట్ కిక్కులో ఉంది.

ఇలాంటి టైమ్ లోనే విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ టీజర్ రిలీజైంది. ఇందులో నలుగురు హీరోయిన్స్ లో రాశీఖన్నా ఒకరు. టీజర్ లో రాశీ న్యూడ్ షో చేసింది. బ్యాక్ లో కనిపించిన రాశీ న్యూడ్ షోని చూసి.. ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూడ్ షో చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నారు. ఐతే, రాశీ అలా కనిపించడానికి కారణాలేంటీ ? అన్నది సినిమా చూసిన తర్వాత క్లారిటీ రానుంది. ఇక టీజర్ ని చూస్తే.. వరల్డ్ ఫేమస్ లవ్వర్ అర్జున్ రెడ్డి సినిమాలు నాలుగు రెట్లలా అనిపిస్తోంది.