‘సామజవరగమన’ ఫీమేల్ వర్షన్ వచ్చేసింది


అల.. పాటలు అద్భుతంగా కుదిరాయ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే కథానాయిక. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అల.. నుంచి వచ్చిన తొలిపాట సామజవరగమన అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న తొలి తెలుగు పాటగా రికార్డులు సృష్టించింది. సిరివెన్నెల సీతారామరాజు రాసిన ఈ పాటని సిద్ శ్రీరామ్ ఆలపించారు.

ఇప్పుడీ పాట ఫీమేల్ వర్షన్ వచ్చేసింది. ప్రముఖ సింగర్ శ్రీయ గోషాల్ ఈ పాటని పాడారు. కొద్దిసేపటి క్రితమే సామజవరగమన ఫీమేల్ వర్షన్ ని విడుదల చేశారు. శ్రీయ గోషాల్ అద్భుతంగా పాడారు. మేల్ వర్షన్ మేజిక్ ఏమాత్రం మిస్ కాకుండా ఉంది.. సామజవరగమన ఫీమేల్ వర్షన్. దాన్ని మీరు కూడా వినేయండీ.. !