‘సామజవరగమన’ ఫీమేల్ వర్షన్ వింటారా.. ?

‘అల.. వైకుంఠపురంలో’ నుంచి మరో సప్రైజ్. అల.. తొలి పాట ‘సామజవరగమన.. ‘ సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. సిరివెన్నెల సీతారామశాస్త్రీ రాసిన ఈ పాటని సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు. థమన్ సంగీతం అందించారు. అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న తొలి తెలుగు పాటగా సామజవరగమన రికార్డ్ సృష్టించింది.

ఇప్పుడీ సినిమా లేడీ వర్షన్ రాబోతుంది. ప్రముఖ సింగర్ శ్రీయ గోషాల్ ఈ పాటని పాడారు. ఈ సాయంత్రం 5:04గంటలకి సామజవరగమన ఫీమేల్ వర్షన్ ని విడుదల చేయనున్నారు. ఇక త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.