సింగర్ కౌసల్యకు వేధింపులు

హీరోయిన్స్ నే కాదు.. సింగర్స్ ని వదలడం లేదు వేధింపు రాయుళ్లు. సింగర్ కౌసల్యకు ఈ మధ్య వేధింపులు ఎక్కువయ్యాట. ఒకటి బ్లాక్ చేస్తుంటే మరొకటి.. ఇలా కౌసల్య 10 కాదు.. 20 కాదు.. ఏకంగా 342 కాంటాక్ట్స్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఇంకా మెసేజ్‌లు ఆగకపోవడంతో.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కౌసల్య పాడిన ఎన్నో పాటలు ఫుల్ పాపులర్‌ అయ్యాయి. ఐతే, ప్రస్తుతం గాయనిగా కౌసల్యకు అవకాశాలు తగ్గాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె గాయనిగా కొనసాగుతూనే నటిగా పేరుతెచ్చుకొనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా నటనలోకి అడుగుపెడుతోంది. సంగీత నేపథ్యం ఉన్న ఓ వెబ్‌ సిరిసీలో ఆమె నటించనుందని సమాచారం.