సీఎంగా కేటీఆర్.. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో చర్చ.. !

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెరాస విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మరికొద్దిసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఇదొక్కటే కాదు.. ఈ సమావేశంలో కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేసే అంశం చర్చకు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

కొన్నాళ్లుగా సీఎం పదవికి కేటీఆర్ అన్ని విధాల అర్హుడని స్వయంగా మంత్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనూ మంత్రులు ఈ విషయాన్ని ప్రస్తావించవచ్చని చెబుతున్నారు. వరంగల్ లో పార్టీ నేతల సమావేశంలో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి.. కేటీఆర్ సమర్థుడు. ఆయన నారా లోకేష్, రాహుల్ గాంధీల అసమర్థుడు కాదు. కేటీఆర్ సీఎం పదవికి అన్ని విధాల అర్హుడు. స్వాత్రంత్య్రం తెచ్చిన గాంధీ కుటుంబం దేశాన్ని పాలించలేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కుటుంబం పాలిస్తే తప్పేంటని ప్రశ్నించారు.
 
మంత్రులందరూ సీఎం పదవికి కేటీఆర్ అర్హుడని అంటున్న నేపథ్యంలో.. ఈ యేడాదియే కేటీఆర్ కి పట్టాభిషేకం చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. గతంలో ఈ అంశంపై స్పందించిన సీఎం కేసీఆర్. ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటానన్నారు. ఇటీవల సీఎం పోస్ట్ పై స్పందించిన కేటీఆర్ ఇదే మాట అన్నారు. మంత్రులు మాత్రం సీఎంగా కేటీఆర్ అర్హుడు అంటున్నారు. మొత్తానికి.. తెరాస శ్రేణులు కేటీఆర్ ని సీఎంగా చూడాలని కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది.