తండ్రైన అనిల్ రావిపూడి

సూపర్ స్టార్ మహేష్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. దర్శకుడు అనిల్ రావిపూడి తండ్రయ్యారంటూ ట్విట్ చేశారు. ఈ ఉదయమే అనిల్ రావిపూడి సతీమణి పండింటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మహేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడికి శుభాకాంక్షలు తెలిపారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా ఈ నెల  11నప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సాయంత్రమే సరిలేరు ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 

మహేష్ తో అనిల్ చేసిన మొదటి చిత్రమిది. ఆయన జీవితంలో మరచిపోలేని చిత్రంగా నిలవనుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. పర్సనల్ గా ఈ సినిమా రిలీజ్ టైంలోనే అనిల్ రావిపూడి తండ్రయ్యారు. పర్సనల్ గా, కెరీర్ పరంగా సరిలేరు అనిల్ రావిపూడికి మరిచిపోలేని చిత్రం కానుంది.