అబ్బా.. సరిలేరు సెంచరీ మిస్ !

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 99 దగ్గర అవుటయితే.. అభిమానులకి ఎంత నిరాశ ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సరిగ్గా 99 దగ్గర ఆగిపోయాడు. అబ్బా.. మహేష్ ఇంకొటి  కొడితే బాగుండని ఆయన అభిమానులు చెప్పుకొంటున్నారు. ఇక్కడ కొట్టాల్సింది 1 పరుగు కాదు. రూ. కోటి. అవునూ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయింది. ప్రపంచ వ్యాప్తం సరిలేరు థియేట్రికల్ రైట్స్ రూ. 99కోట్లకి అమ్ముడుపోయాయి. ఏరియాలవారీగా చూస్తే.. నైజాం రూ. 24 కోట్లు, సీడెడ్ రూ. 10.80 కోట్లు, యుఎస్ రూ. 10 కోట్లు, గుంటూరు రూ.  7.20 కోట్లు, ఈ. గోదావారి రూ. 7.20 కోట్లు, కృష్ణ రూ. 6 కోట్లు, వె. గోదావరి రూ. 6 కోట్లు, నెల్లూరు రూ. 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 74.20 కోట్లు (76.50 Cr including P&P) బిజినెస్ జరిగింది.