సరిలేరు ప్రీ-రిలీజ్.. ఇవే హైలైట్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మహేష్, మెగా అభిమానులతో ఎల్భీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఈ వేడుకలో మిల్కీబ్యూటీ తమన్నా డ్యాంగ్ డ్యాంగ్ పాటకి డ్యాన్స్ చేయనుంది. 

సరిలేరు ప్రీ-రిలీజ్ హైలైట్స్ :

* మెగాస్టార్ చిరంజీవి-సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే వేదికపై సందడి చేయనున్నారు

* మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కలిసి నటించిన పలు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

* వీరిద్దరు చాలా యేళ్ల తర్వాత స్టేజ్ ని పంచుకోనున్నారు

* చిరు-మహేష్-విజయశాంతిలని ఒకే వేదికపై చూడబోతుండటం విశేషం

* ఇలాంటి వేడుకల్లో దేవిశ్రీ జోష్ మాములుగా ఉండదు.

* మిల్కీబ్యూటీ తమన్నా లైవ్ లో డ్యాన్స్ చేస్తుండం మరో హైలైట్

* సూపర్ స్టార్ గురించి మెగాస్టార్ ఏం మాట్లాడతారు అనేది ఆసక్తిగా మారింది.

మొత్తానికి.. ఈ మెగా సూపర్ ఈవెంట్ మెగా, ప్రిన్స్ అభిమానులకి ఓ పండగలాంటిదే.