లైవ్ : అల.. మ్యూజికల్ నైట్


సంక్రాంతి సినిమాలు రిలీజ్ కి ముందే మురిపిస్తున్నాయి. ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్ ని ఘనంగా జరుపుకుంటున్నాయి. ఆదివారం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కిక్కు నుంచి ఇంకా బయటికిరాకముందే.. మరో సంక్రాంతి సినిమా అల.. వైకుంఠప్రురంలో మ్యూజికల్ నైట్ వచ్చేసింది. త్రివిక్రమ్-అల్లుఅర్జున్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ అల.. మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మ్యూజికల్ నైట్ ప్రారంభం అయింది. సౌత్ లోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ నైట్ గా ఏర్పాట్లు చేశారు. రియల్ సింగర్స్ లైవ్ ఫర్ ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. ఇక ఇప్పటికే వేదిక అభిమానులతో నిండిపోయింది. బన్నీ ఫ్యాన్స్ ఈలలు, కేకలతో అదరగొడుతున్నారు.