సరిలేరు రన్ టైం ఎంతో తెలుసా.. ?

సంక్రాంతి మొదటి పుంజుగా సూపర్ స్టార్ మహేష్ బాబు బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందింది. తాజాగా సెన్సార్ కాపీ చిత్రబృందానికి అందింది. సరిలేరు నిడివి 2గంటల 49నిమిషాలుగా లాక్ చేశారు.

దాదాపు మూడు గంటల సినిమా అన్నమాట. అనిల్ రావిపూడి సినిమాలు ఎంటర్ టైనింగ్ గా ఉంటాయి. అదే ఆయన ప్రత్యేకత. ఈ నేపథ్యంలో సరిలేరు నిడివి పట్ల భయపడాల్సిన పనిలేదని చిత్రబృందం చెబుతోంది. ఇక సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సరిలేరు అద్భుతంగా ఉందని కితాబిచ్చినట్టు తెలుస్తోంది.

ఈ చిత్రంలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటించారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 99కోట్లకి అమ్ముడిపోయాయ్. మహేశ్ కెరీర్ లోనే అత్యధిక రేటుకి అమ్ముడుపోయిన సినిమా ఇది. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు. అనిల్ సుంకర-దిల్ రాజు-మహేష్ సంయుక్తంగా నిర్మించారు.