అల.. ఇలా ఉండబోతుంది.. లీక్ చేసిన చేసిన సునీల్ !

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అంటేనే పండగలా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి థియేటర్ కెళ్లి సినిమా చూడొచ్చు. హాయిగా నవ్వుకోవచ్చు. నవ్వు ఒక్కటే కాదు.. బరువు, బాధ్యతలని గుర్తు చేస్తారు త్రివిక్రమ్. జీవిత సత్యాలని బోధిస్తారు. అందుకే త్రివిక్రమ్ సినిమా కోసం అన్నీ వర్గాల ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు.

ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురంలో’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అల.. ఎలా ఉండబోతుంది ? అనేది కమెడియన్ సునీల్ ముందే లీక్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో అల.. మ్యూజికల్ నైట్ ఘనంగా జరుగుతోంది.

ఈ వేడుకలో సునీల్ మాట్లాడుతూ.. ‘అల.. ఎలా ఉండబోతుందో తనదైన శైలిలో చెప్పారు. సినిమా చూడ్డానికి థియేటర్ కి వెళ్లి ప్రేక్షకులకి సినిమా స్టార్ట్ కాగానే.. అల చిత్రబృందం మొత్తం మీ ఇంటికే వచ్చినట్టుంది. సినిమా పండగలా ఉంటుంది. ఈ సంక్రాంతికి అల.. సినిమా చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరి ఇంటికి.. అల.. చిత్రబృందం వస్తుందన్నారు. ఇక త్రివిక్రమ్ కొత్త డ్రెస్ మార్చుకున్న ఈజీగా కొత్త సినిమా చేసేస్తాడని చెప్పుకొచ్చాడు.

ఇక బన్నీ గురించి మాట్లాడుతూ… ఆయనకు స్టార్ అనే ఫీలింగ్ ఉండదు. బన్నీతో పరుగు, ఆర్య సినిమాల్లో నటించా.. ఇది బన్నీతో మూడో సినిమా అన్నారు. సినిమా అద్భుతంగా ఉండబోతుంది. థియేటర్ కి వెళ్లి ఎంజాయ్ చేయండన్నారు సునీల్. సునీల్ చెప్పిదాన్ని బట్టీ చూస్తే.. సంక్రాంతి పండగకి పండగలాంటి సినిమాని తీసుకొస్తున్నారు త్రివిక్రమ్.