సరిలేరుకు కాపీ మరక


ప్రస్తుత పరిస్థితుల్లో కాపీ కొట్టడం కష్టం. వాటిని ఇట్టే పట్టేస్తున్నారు నెటిజన్స్. కాపీ కాదు కదా.. ప్రేరణ పొందిన విషయాన్ని కూడా పసిగట్టేస్తున్నారు. ఈ క్రమంలో సరిలేరు ఊతపదాలని కాపీ అని తేల్చేశారు. కథని ఎంటర్ టైనింగ్’గా చెప్పడం దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకత. ఇందుకోసం తన సినిమాలో ఒకట్రెండు ఊతపదాలని వాడుతుంటారు. ‘ఎఫ్2’లో ‘అంతేగా’ ఊతపదం ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన పాత్రకి రెండు ఊతపదాలు పెట్టాడు దర్శకుడు. అవే..  ‘మీకు అర్ధమౌతోందా’, ‘ఐయామ్ ఇంప్రెసెడ్’. ఐతే ఈ రెండు ఊతపదాలు కాపీయే అని నెటిజన్స్ తేల్చేశారు. ‘మీకు అర్ధమౌతోందా’ అన్నది గాయని గీతా మాధురి ఊతపదం. బిగ్ బాస్ 2 లో పాల్గొన్న గీతా మాధురి నోటి వెంట ఈ ఊతపదాన్ని బుల్లి తెర ప్రేక్షకులు ఉన్నారు. ఎంజాయ్ చేశారు. ఇక ఐయామ్ ఇంప్రెసిడ్ బావా అంటూ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ‘శతమానం భవతి’ సినిమాలో సందడి చేసింది. ఈ నేపథ్యంలో సరిలేరు ఊతపదాలు కాపీని నెటిజన్స్ తేల్చేశారు. ఐతే, ఈ పదాలని కాపీ రైట్స్ చెల్లించనక్కర్లేదు.. !!