ఈ నెల 22న నిర్భయ నిందితులకి ఉరిశిక్ష 

దేశ రాజధానిలో నిర్భయపై ఘాతుకానికి పాల్పడిన మానవ మృగాలకు మరణశిక్ష ఖరారైంది. ఈ మేరకు ఢిల్లీ పాటియాలా హౌస్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ నెల 22న నిర్భయ మృగాలని ఉరితీయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. డిసెంబర్‌ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్‌ రేప్‌ కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది.

ఇప్పటికీ మా కూతురికి న్యాయం జరిగిందని నిర్భయ తల్లి ఆశా దేవి అన్నారు. నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయడం ద్వారా దేశంలోని మహిళాశక్తి బలోపేతం అవుతుందన్నారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని బలపరుస్తుందని ఆమె పేర్కొన్నారు.