రాజకీయాల్లో అవేశం పనికిరాదు : ఈటెల
ఈ మధ్య తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ ఏం మాట్లాడిన భూతద్దంలో పెట్టి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ? ఆయన ఒకానొక సమయంలో టీఆర్ఎస్ రెబల్ క్యాండిడేట్’గా మారినట్టు అనిపించింది. గులాబీ జెండకి అసలైన ఓనర్లమని ప్రకటించుకున్నారు. ప్రస్తుతం ఈటెల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.మంగళవారం హుజురాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటెల మాట్లాడారు.
దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 32 జిల్లా పరిషత్తులు కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్ అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధింస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలంటేనే కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అందరిని కలుపుకుపోయే వారివే టికెట్లు లభిస్తాయని స్పష్టం చేశారు.
కౌన్సిలర్ల అభిప్రాయం మేరకే చైర్మన్‌లను ఎన్నుకుంటామని పేర్కొన్నారు. చెల్లని రూపాయికి గీతలెక్కువ అన్నట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని విమర్శించారు. ఆఖరులో మాత్రం ఈటెల తన మార్క్ ని చూపించారు. డబ్బులకు అమ్ముడుపోయే నాయకుడు ఎప్పుడూ రాజకీయాల్లో పైకిరారని.. నిబద్దత ఉన్న వాడే రాజకీయాల్లో పనిచేస్తాడని.. రాజకీయాల్లో అవేశం పనికి రాదన్నారు.