2020లో టీమిండియా బోణి
2020లో టీమిండియా బోణీ కొట్టింది. ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఘన విజయం సాధించింది. 143 పరుగుల లక్ష్యాన్ని 15బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ 45 (32బంతుల్లో 6ఫోర్లు), శిఖర్ ధావన్ 32 (29 బంతుల్లో, 2ఫోర్లు) శుభారంభం చేశారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 34 (24బంతుల్లో, 3ఫోర్లు, 1సిక్స్), కెప్టెన్ కోహ్లీ 30 (17బంతుల్లో 1ఫోర్, 2 సిక్స్)లు జట్టుని విజయతీరాలకి చేర్చారు. ఐతే, ఆఖరి మెట్టుమీద అయ్యార్ అవుటైనా.. పంత్ 1 పరుగుతో కలిసి కోహ్లీ లాంచనాన్ని పూర్తి చేశారు.
అంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. భారత బౌలర్లు విజృంభించడంతో లంక ఆటగాళ్లు ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. కుశాల్ పెరీరా 34 మినహా మిగిలిన ఆటగాళ్లంతా స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. అవిష్కా ఫెర్నాండో 22, ఓపెనర్ గుణతిలక 20, డి సెల్వా 17, హసరంగ 16 నాటౌట్ పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లు శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, బుమ్రా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.