ఏపీ రాజధానులపై జగన్’కి కేసీఆర్ సలహాలు ?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం కావడం కొత్తేమీ కాదు. గతంలోనూ వీరిద్దరు సమావేశమయ్యారు. విభజన సమస్యలపై చర్చించారు. ఈ నెల 13న జగన్, కేసీఆర్ మరోసారి సమావేశం కానున్నారు. ఐతే, ఈ సారి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం బర్నింగ్ టాపిక్ గా ఉంది. ఇలాంటి సమయంలో జగన్, కేసీఆర్ భేటీ ప్రాధాన్యతని సంతరించుకుంది.
తాజా రాజకీయాలపై ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశముంది. ఏపీలో మూడురాజధానులపై చర్చ కూడా చర్చకు రావొచు. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని విషయంలో జగన్ కి కేసీఆర్ ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తారా ? అన్నది హాట్ టాపిక్ గా మారింది. కొన్ని విషయాల్లో ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ని అనుకరిస్తున్నారనే ప్రచారం ఉంది. ఇటీవల తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ మొండిగా వ్యవరించిన సంగతి తెలిసిందే.
ఆర్టీసీ కార్మికుల గొంతెమ్మ కోరికలు తీర్చడం సాధ్యం కాదు. యూనియన్ లీడర్ల మాయ మాటల్లో పడి ఉద్యోగాలు పోగొట్టుకోవద్దన్నారు. ఫైనల్ గా తిట్టిన ఆర్టీసీ కార్మికులతోనే జై కొట్టించుకున్నారు కేసీఆర్. దేవుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు రాజధాని రైతుల ఆందోళన విషయంలోనూ సీఎం జగన్ ఇలాగే వ్యవహరిస్తున్నారు. రైతులకి నష్టం కలగకుండా చూసుకొనే బాధ్యత మాది. ప్రతిపక్ష నేతల మాటలు పట్టించుకొని ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 13న జరగబోయే భేటీలో ఏపీ రాజధానిపై ఏపీ సీఎం జగన్ కి తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమైనా సూచనలు, సలహాలు ఇస్తారా ? అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు, ఈ నెల 13న భేటీలో కేవలం రెండు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారంపైనా చర్చించే అవకాశముందని తెలుస్తోంది. దీంతో పాటు నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, తదితర అంశాలు వీరి భేటీలో చర్చకు వచ్చే అవకాశముందని సమాచారమ్.