బీజేపీలో చేరిన మోత్కుపల్లి
తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు ఉన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడిన తెలంగాణ భాజాపా అధ్యక్షుడు లక్ష్మన్.. త్కుపల్లి రాక తెలంగాణలో భాజపా బలోపేతానికి తోడ్పడుతుందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతోందని చెప్పారు. మోత్కుపల్లి యాదాద్రిజిల్లా ఆలేరు నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు గెలుపొందారు.
తెదేపా, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆలేరు నుంచి గెలిచిన మోత్కుపల్లి రాష్ట్ర విభజన తర్వాత తెదేపాని తెరాసలో విలీనం చేయాలంటూ సంచలన ప్రకటన చేశారు. దాంతో.. ఆయన్ని తెదేపా పార్టీ నుంచి బహిష్కరించింది. అప్పటి నుంచి ఏ పార్టీలో చేరని మోత్కుపల్లి.. తాజాగా కమలం గూటికి చేరారు.