తెలుగు96 టైటిల్ ‘జాను’


2000 దశాబ్ధంలోనే బెస్ట్ ప్రేమకథా చిత్రంగా నిలిచింది తమిళ చిత్రం ’96’. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి-త్రిషగా జంటగా నటించిన చిత్రమిది. 2018 అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడీ ప్రేమకథాచిత్రం తెలుగులో శర్వానంద్-సమంత జంటగా రిమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ఫిబ్రవరిలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘జాను’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. సినిమాలో శర్వా ‘జాన్’ అనే పేరుతో సమంత ‘అను’ పేర్లతో కనిపించబోతున్నట్టు ఇంగ్లీష్ లో ముద్రించిన టైటిల్ ని చూస్తే అర్థమవుతోంది. ఎడారిలో ఒంటలని చూస్తే శర్వానంద్ నడుస్తున్న ఫోటోని టైటిల్ ఫోస్టర్ గా వదిలారు.