మాటల మాంత్రికుడి.. మాటల వర్షం !

మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ మాటల వర్షంలో మెగా అభిమానులు తడిసిముద్దైపోయారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. ఈ సినిమా మ్యూజికల్ నైట్ హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరుగుతోంది. ఈ వేదికపై త్రివిక్రమ్ మాటల వర్షం కురిపించారు. ఆ వర్షంలో ఫంక్షన్ కి వచ్చిన అభిమానులు, టీవీల్లో చూసిన ప్రేక్షకులు తడసి ముద్దైపోయారు.

త్రివిక్రమ్ స్టేజ్ పైకి రాగానే సంగీత దర్శకుడు థమన్, సిద్ శ్రీరామ్, శివమణి తదితరులకి హాగ్ ఇచ్చారు. అంతేకాదు.. పాటల రచతలు, గాయకులు, సంగీత కళాకారులని పేరు పేరున అభినందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే పాటకి పూజ చేశారు. సంగీతాన్ని శరీరం దురదపెడితే గోక్కునే దువ్వెన లాంటిదని తనదైన శైలిలో చెప్పారు. త్రివిక్రమ్ మాటలని రాతల్లో చెప్పడం కష్టం.. మీరే లైవ్ లో చూసేయండీ.. !